Wednesday 19 November 2014

మరుపు గొప్ప వరం

మరుపు గొప్ప వరం
మరుపే నా బలం
మరుపే నాకు ప్రాణం పోసిన సంజీవని

నా మనసు హరించుకోలేని చేదు నిజాలని దాచుకుంది
గతం చేసిన గాయాలకు మందై మానిపించింది 
నిన్నటి తాలుకు కన్నీళ్ళను తుడిచి కొండంత ఊరటనిచ్చింది
కాలానికి తోడుగా వచ్చి నిన్నలని చెరిపేసి రేపటికి
మార్గదర్శాన్ని చూపే దిక్సూచి అయ్యింది.      

Monday 10 November 2014

Botany పాఠముంది

అమలాపురం పిల్ల వుంది
హైదరాబాదు  పోరి ఉంది 
దేనికో ఓటు చెప్పరా
ఐఐటీ కుట్టీ వుంది
డాక్టరమ్మ  మస్తుగుంది
చెప్పురా ఏది బెస్ట్ రోయ్
అమలాపురం పిల్లైతే బోరు బోరు
హైదరాబాద్ పోరైతే జోరు జోరు
చదువుకున్నమ్మాయికి తలకు పొగరు
చదువురానమ్మయే నీకు తగదురా
జగడ జగడ జగడ చా

దువ్వరా కోది జుట్టు పుయ్యరా ఫేసు క్రీము
కొద్దిగా ఫేసు మార్చరా ఒరేయి
తందనా తాన తనన్ తందనా తాన తనన్ తందనా తాన తనన్ నా
ఫుడ్ పై ఉన్న శ్రధ్ధ ఫేసుపై పెట్టు కాస్త
మస్తు పోరి నీకు దొరుకురా
అరె ఏంది  భయ్
నల్లగ పొట్టిగా వున్నవాళ్ళు
బుర్ర పెట్టి పోరీలను పటాయిస్తరు
స్టైలు అంటూ ఫోజులను కొట్టేటోళ్ళు
ఆవరేజు చాలు అంటూ సరిపెట్టుకుంటరు

ఆప్షన్లు ఎక్కువాయే
కంఫ్యూజన్ పెరిగిపాయె
ఏదిరొయి నీకు  దిక్కురా
బారుగా లైను ఉంది
ఎంతకీ తగ్గనంది
ఏదిరోయి నీకు బెస్టు రా 
ఎందుకీ హైరానా వెర్రి నాన్న
వెళ్ళరా సులువైనా దారిలోనా
బొద్దుగున్నమ్మాయే నీకు మ్యాచు రా
తెల్లగుంటే చాలులే అదే  ఎక్కువోయి
జగడ జగడ జగడ చా

పుట్టిన రోజు శుభాకాంక్షలు...

వీచేటి గాలులు పిలిచాయి
పూచేటి పూవులు పిలిచాయి
ఇదిగో నీకే ఏదో చెప్పాలంటా
కూసేటి కోయిల పిలిచే
మెరిసేటి జాబిలి పిలిచే
ఇదిగో నిన్నే రమ్మంటున్నాయి
ప్రతీ రోజు ఓ పండగల్లే మరి మారిపోవునంటూ
నిండు నూరేళ్ళు సంతోషాలు నిన్ను చేరునంటూ
కోకిల పాట పాడి చెప్పే
పూవులు రెక్కలూపి చెప్పే
చల్లని గాలి వీచి చెప్పే
జాబిలి వెన్నెలిచ్చి చెప్పే
నువ్వు కలకాలం చల్లగా వర్ధిల్లు

గణ్ గణ్ గణ్ గణ్ అని మోగింది గర్భ గుడిలో కొలువున్న గంటా
నీ నీ నీ నీకే పుట్టినరోజు ఇదిగొ శుభాకాంక్షలు చెబుతున్నాయి

ఏదో ప్రియ రాగం

ఏదో ప్రియ రాగం పలికింది నా హృదయంలో అది తనలో మన స్నేహం నింపింది
సరిగమల మధురిమలే పలికాయి నా గుండెల్లో అవి తనలోని ఊసులు చెప్పాయి

ఏనాటికి మన స్నేహం చెరిగేది కాదు అనీ
ఇక పై ఏ చీకటులు మనవైపుకు చేరవని
నేస్తం ప్రియనేస్తం మనమంతా ఒకటెలే
మనం అంతా చిరు పాటలు పాడి
మనం అంతా చిరు చిందులు వేసి
కనిపించే ఆ నింగిని కూడా కిందికి దించాలి..
ఆకాశంలో పక్షిగా ఎగిరి
గగనం లోని చుక్కలు పట్టి
మనమంతా ఇక ఇంకో లోకం అంచులు చేరాలి

పాలు నీళ్ళ అనుబంధం మన బంధమంటే పొరబాటోయి
ఏ రాజహంస చెరిపేయలేదులె  మాసిపోని మన స్నేహం
నిన్నలోని ఆ సంధ్య, ఆ సంధ్యలోని ఆనందం
మరువలేని ఆ జ్ఞాపకాలను  మనసులోనే దాచాను.

నీ స్నేహపు చినుకులతో చిగురిచిన వాసంతం
మా గుండెల వాకిలిలో  నువు నింపిన సుమగంధం
నేస్తం  ప్రియ నేస్తం ఏనాటికి వాడదులే
 ఆకాశంలో అవధుల కన్నా
సంద్రములోని లోతులకన్నా
ఎల్లలు  హద్దులు అంటూ తెలియని స్నేహమే మిన్నదిలే
ఆ మల్లెలలోని గంధం కన్నా
జాబిలిలోని వెన్నెలకన్నా
కోకిల పాడే పాటలకన్నా  మధురం మన స్నేహం

Saturday 1 November 2014

మరువలేను


మరువలేను నేను,
మనం గడిపిన మధుర క్షణాలు..
తిరిగి రావు నేడు,
మనకు మిగిలిన తీపి గుర్తులు..
అనుభవాలు, జ్ఞాపకాలు మాత్రం మిగిలాయి,
గతం అనే నిన్నలో ఉండిపొయాయి..
నేటికి, రేపటికి తిరిగొస్తాయని నమ్మకం లేకపొయినా..
మనసు అనే కోటలొ జ్ఞాపకాలన్నిటినీ మూటకట్టి,
ఇనుప పెట్టెలొ దాచిపెట్టాను..
గతం గుర్తుకొచ్చిన ప్రతీ నిమిషం,
జ్ఞాపకాల తోటలొ విహరిస్తూ నిన్నలోకి చేరుకుంటాను..
ప్రతీ క్షణాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ నను నేనే మైమరిచిపొతాను..

Monday 21 April 2014

వచ్చిపో చెలీ!

 ఒక్కసారి వచ్చిపో చెలీ!
చిరునవ్వులు ఇచ్చిపో నిచ్చెలీ!!

కన్నీటి వానలో తడిసి ముద్దవుతున్నా 
నీ వలపు గొడుగు పట్టలేవా?
శోకమనే ఎడారిలో కొట్టుమిట్టాడుతున్నా 
నీ చిరునవ్వులతో ఈ దాహార్తి తీర్చలేవా?
   
నీ చెలిమి లో చింతలనేవే నా చెంతకు రాలేదు
నీ కలిమిలో కలతనేవే నా దరికి చేరలేదు

భయమే బెదిరిపోయి పారిపోయింది
నువ్వు నా తోడున్నావని భయపడిపోయి
విజయాలన్నీ నా కైవసం అంటూ తలవంచాయి
నువ్వు నాకిచ్చిన ప్రోత్సాహానికి మురిసిపోయి

నీతో గడిచిన ప్రతీ క్షణం మధురాతి మధురం
నీతో నడిచిన నడక  నల్లేరుపై బండి నడక
నా జీవితం ఒక పుస్తకమైతే
ఆనందంతో నిండిన ప్రతీ పుటలో నువ్వే నువ్వే

నువ్వు లేని నేడు
ఆనందం ఒక్క పరికైనా వచ్చిపోనంది
కన్నీరయినా నా తోడేమోననుకుంటే
నువ్వు లేని నన్ను చూసి తట్టుకోలేనంటూ వెళ్ళిపోయింది
నా గొంతు ఈ కవిత కూడా
పలుకలేనంటూ మూగబోయింది
  
ఏ తోడూ లేని నా మనసు ఇంతటి క్షోభను
భరించలేనంటూ చచ్చిపోతుంది