Monday 10 November 2014

ఏదో ప్రియ రాగం

ఏదో ప్రియ రాగం పలికింది నా హృదయంలో అది తనలో మన స్నేహం నింపింది
సరిగమల మధురిమలే పలికాయి నా గుండెల్లో అవి తనలోని ఊసులు చెప్పాయి

ఏనాటికి మన స్నేహం చెరిగేది కాదు అనీ
ఇక పై ఏ చీకటులు మనవైపుకు చేరవని
నేస్తం ప్రియనేస్తం మనమంతా ఒకటెలే
మనం అంతా చిరు పాటలు పాడి
మనం అంతా చిరు చిందులు వేసి
కనిపించే ఆ నింగిని కూడా కిందికి దించాలి..
ఆకాశంలో పక్షిగా ఎగిరి
గగనం లోని చుక్కలు పట్టి
మనమంతా ఇక ఇంకో లోకం అంచులు చేరాలి

పాలు నీళ్ళ అనుబంధం మన బంధమంటే పొరబాటోయి
ఏ రాజహంస చెరిపేయలేదులె  మాసిపోని మన స్నేహం
నిన్నలోని ఆ సంధ్య, ఆ సంధ్యలోని ఆనందం
మరువలేని ఆ జ్ఞాపకాలను  మనసులోనే దాచాను.

నీ స్నేహపు చినుకులతో చిగురిచిన వాసంతం
మా గుండెల వాకిలిలో  నువు నింపిన సుమగంధం
నేస్తం  ప్రియ నేస్తం ఏనాటికి వాడదులే
 ఆకాశంలో అవధుల కన్నా
సంద్రములోని లోతులకన్నా
ఎల్లలు  హద్దులు అంటూ తెలియని స్నేహమే మిన్నదిలే
ఆ మల్లెలలోని గంధం కన్నా
జాబిలిలోని వెన్నెలకన్నా
కోకిల పాడే పాటలకన్నా  మధురం మన స్నేహం

1 comment:

  1. edo priya raagam vintunaa chirunavvullo prema aa savvadi needenaa..

    ReplyDelete