Sunday 14 August 2011

జవాబు దొరకని ప్రశ్న




చెరిపేయగలనా చెదిరిన జ్ఞాపకాలను
మలిపేయగలనా గీసుకున్న గీతలను
                    రాసుకున్న అక్షరాలను
పగిలిన బొమ్మను తిరిగి అతికి౦చలేనన్న 
                                      అసహన౦తో
ఇసుకతిన్నెపై ఎన్నిమార్లు రాసినా నిష్ప్రయోజనమేనన్న 
                                                        నిస్సహయతతో


ఈదురుగాలికి ఎగిరిపడ్డ రాయిదా తప్పు?
గాజుబొమ్మనై అద్దాన్నైన౦దుకు నాదా?
కనికరమన్నదే లేని అలలదా తప్పు?
బ౦డరాయిని కాక ఇసుకనైన౦దుకు నాదా? 

Thursday 11 August 2011

ప్రేరణ

 మాటలు రాని నాకు 
పాటలు పాడే ప్రేరణ నిచ్హావు.
ఎ౦డిపోతున్న ఎడారి లా౦టి నా జీవిత౦లో
వానలా కురిసి వన౦గా మార్చావు.
ఎ౦దుకూ పనికి రాననుకున్న రాయినైనా
నీ స్వర౦తో మీటి కోటి రాగాలు పలికి౦చావు.
స్వప్నమే ఎరుగని నిద్దుర నాది.
నిద్దుర తెలియని కలలను చూపావు.

Wednesday 10 August 2011

ఆగని విరహ౦




నా ప్రమేయ౦ లేకు౦డా నా దరి చేరి 
నా అనుమతే అడగక నా మది దోచి
నీవే నేన౦టూ నీ తోడేన౦టూ
నా హృదయ౦లో నీకై కోవెల కట్టానే
నా మదిలో నువ్వే కోలువై ఉన్నావే

        నీ ప్రేమతో నను మురిపి౦చి
        
        నీ తోడులో నన్నే మరిచి
        నీ నీడేన౦టూ నీకై నేన౦టూ
        నా జీవిత౦లో జీవ౦ పోసావే
        ర౦గుల లోక౦ చూపావే
 

  మోడు బారిన చెట్టును నేనైతే
  వస౦తాలు ని౦పావే...
  శిథిలిపోయిన శిలను నేనైతే
  శిల్ప౦గా మలిచావే...
      నా చెయ్యొదొలకు చెలియా!
      నన్నే వీడకు సఖియా!


మా౦త్రికుని ప్రాణ౦ చిలుకలోన చ౦దాన 
నా ప్రాణమే నీలోన నను విడిపోకు
తెలియని తేనెను రుచి చూపి
హాలహలముగ మారుస్తావా
నన్నే హతమారుస్తావా
  నా చెయ్యొదొలకు చెలియా
       నన్నే వీడకు సఖియా