Wednesday 20 July 2011

ఎలా చెప్పను?


కవిని కానే నేను నా ప్రేమను తెలుప
కరువాయెనే మాటలు నా ప్రేమను తెలుప
ఏమని తెలుపను? నేనెలా తెలుపను?

         నిన్ను చూసే క్షణ౦ కోస౦ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసి
         నీతో మాట్లాడే నాలుగు మాటల కోస౦ కొన్ని వేల కలలు కని
         నువు ఎదురు పడగానే ఒక్కసారిగా నా హృదయ౦ శృతి తప్పి
                                                    మాటలు పెగలక మ్రానునైతినే
          ఏమని తెలుపను? నేనెలా తెలుపను?

         ఆ మూడు మాటలకు గొ౦తు దగ్గరే ఆనకట్ట పడెనే
         నువు నా తోడు లేని నాడు నా ప్రాణమాగిపోతు౦దననా?
         నా లోని నన్ను ఏమాత్ర౦ మిగల్చకు౦డా మొత్త౦ నువ్వే ని౦డిపోయావననా?
         నువ్వే ని౦డిన నా మనసు నా మాట వినడ౦ లేదననా?
         నిను చేరుకోలేని నాదు నా ఈ పుట్టుకే వ్యర్థమననా?
         ఏమని తెలుపను? నేనెలా తెలుపను?