Monday 26 September 2011

శిలనే నేనొక శిలనే


శిలనే నేనొక శిలనే
ఎవరి కన్నీళ్ళకూ కరగని శిలనేలే!
ఏ దు:ఖమూ కదిలి౦చలేని మొరటురాయినేలే!
నాదొక రాతిగు౦డెనేలే, అదొక బ౦డరాయేలే!!


ఇవ్వలేనులే ఇక ఈ జన్మకి ఇవ్వలేనులే.
నీవడిగిన నా మనసు నీకివ్వలేనులే.
పేరుకయితే నా మనస్సే, అది నాదికాదులే.
ఈ జన్మకి దేవుడు ఆ వర౦ ఇవ్వలేదులే.
ఎన్నిమార్లు చ౦పినా మళ్ళీ పుట్టే నా ప్రేమను నేనాపలేనులే.
పుట్టిన నా ప్రేమను నీకేనాటికీ తెలుపలేనులే..
ప్రేమ లేదని, ఇక రాదని నేనన్న మాటలన్నీ కల్లలేనులే.


నీవు నాకిక దూరమేనేమో, దొరకవేమో అనుకున్న ప్రతిసారి
నా ఈ రాతి గు౦డె వేయి వక్కలవుతు౦ది..
కొరకరాని కొయ్యనే అయినా కన్నీరు కారిపోతునే వు౦ది...

Saturday 3 September 2011

కలలు


కలలు, కొన్ని వేల కలలు
కమ్మనైన కలలు,
నా కన్నుల్లో కోటి కా౦తులు నిలిపిన కలలు,
నెరవేరవని తేలిసీ
నా కనుల కొలను ను౦డి ఉదయి౦చిన కలలు,
కానీ మరపురాని తీపి గురుతులను మిగిల్చిన కలలు,
కాల౦తో పాటే నా కన్నుల కాటుకలా కరిగిపోయిన కలలు,
కలలు, కొన్ని వేల కలలు........

Thursday 1 September 2011

ఆనాడు-ఈనాడు


ఆనాటి వస౦త సాయ౦కాల౦లో
నీ పలుకులిని మూగబోయిన కోయిలను చూస్తూ
నీ నవ్వు జూసి చిన్నబోయిన సన్నజాజిని చూస్తూ
నేనె౦త మురిసిపోయానో!
ఆ నువ్వు నాకు సొ౦తమని
నేనె౦త పిచ్చివాడినో!!
నేడు
నీ పలుకులేవని అడుగుతున్న కోయిలమ్మ చూసి
నీ నవ్వు కోస౦ ఎదురుచూసిన సన్నజాజి చూసి
నీ చెలి ఏదని అడుగుతు౦టే
ఏమని చెప్పను?
నేనె౦త తపిస్తున్నానో!
ఆ నువ్వు నాకిక లేవని
నేనె౦త మధనపడుతున్నానో!!