Friday 30 March 2012


సాగరాన్ని చేరేవరకూ
అవి కొ౦డలయినా, లోయలైనా ఎత్తు పల్లాలెన్నున్నా
గమ్యాన్ని చేరాలని పరుగులు పెడుతున్న
నదిని చూసి నేర్చుకోవాలి.
ఆకాశాన్న౦టాలని
పగలనక, రేయనక అలుపన్నదే ఎరుగక ఎగిసిపడే
కెరటాల సాటి లేని పట్టుదలను,
అ౦గుళమ౦తయినా తరగని ఓపికను
చూసి నేర్చుకోవాలి.
తన జీవిత కాల౦ కేవల౦ ఒక రోజైనా
నిత్య౦ నవ్వుతు౦డే రోజాని 
చూసి నేనె౦తో నేర్చుకోవాలి.
తనకున్న చిరుకా౦తిని లోకమ౦తా ప౦చాలన్న తపనతో వేవేల దీపాలను వెలిగి౦చే 
దీపాన్ని చూసి నేర్చుకోవాలి
.
తను నిలువునా కరుగుతూ కా౦తి ప౦చుతున్న
కొవ్వొత్తి త్యాగగుణాన్ని నేర్చుకోవాలి.
ప్రకృతిన౦దున్న ప్రతీ ఒక్కటీ 
నను చూసి నేర్చుకోవాలన్పి౦చేతగా నను నేను మలుచుకోవాలి.  

Saturday 18 February 2012

నేనెందుకు వేరైపోతిని మరి?

నిన్ను మోసే  నేలే నన్నూ  మోస్తోందే
నేను  అర్హుడను  కాను  అని నన్ను ఎక్కడ పారేయలేదే?
గలగలా పారే గంగమ్మ నా దాహమూ తీర్చిందే
నేనసలు మనిషినే కానని నాకసలు దాహమే ఉండదని
నన్ను నీవు తాకవద్దని ఏనాడు అనలేదే?
నీవు పీల్చే గాలే నాకూ జీవం పోస్తోందే 
నాకసలు ప్రాణమే ఉండదనీ
నేను నీ లోనికి రాలేనని నన్నెన్నడూ వదలలేదే?
నా నీడకి నువ్వు రావొద్దని,
నా పండ్లను నీవు తినవద్దని 
నా పూలను నీవు కోయవద్దని,
ఆ చెట్టయినా నన్నెపుడూ వేరుచేయలేదే?


నిను తడిపిన ఆ మేఘం నా వద్ద ఆగిపోలేదే?
నీలోన ప్రవహించే అదే రక్తం నాలోన  లేదా?
నీకున్న ఆ హృదయం నాకంటూ లేదా?
నీలోని పరమాత్మ నాలోనూ ఉంటే
నేనెందుకు వేరైపోతిని మరి?
పంచభూతాలకు లేని పక్షపాతం మనకెందుకయా?
నీదే జాతని నాదే మతమని ఎందుకయా?