Thursday, 28 April 2011

చెలీ రావే!!!

నువ్వు కనబడవని తెలిసినా
నిన్నే వెతికే  నా కనులకేమని చెప్పను చెలియా?
నీ మాటలిక వినబడవని తెలిసినా 
నీ తియ్యని తేనెల మాటల కోసం తపించిపోయే 
నా మనసుకి ఏమని చెప్పను? 
నువ్వు లేవని ఇక రావని తెలిసినా 
నీకై నడిచే నా అడుగులకి ఏమని చెప్పను?
నా మాటలు నీకు వినబడవని తెలిసినా 
పిచ్చిగా అరిచే నా గొంతుకకు ఏమని చెప్పను?

నిను వీడి క్షణమైనా ఉండలేననుకునే నేను 
నీ విరహాన్ని తాలలేననుకునే నేను 
నువ్వు లేని క్షణమొక యుగమనుకునే నేను 
నీతో ఇక క్షణమైనా గడపలేనని తెలిశాక........ 

Sunday, 24 April 2011

నాలో ఒక కొత్త అనుభవం

ఏనాడు లేనిది ఈనాడు ఏమైనది
కుదురుగా ఉండనన్నది నా మది
 నీ కోసం పరుగులెడుతున్నది
నిమిషమైన నా మనసు నిను వదలనంటున్నది
నీ ధ్యాసలో పడి అది నన్నే మరిచినదే 
నీ పేరు తలచగానే ఏదో పులకరింత
నీ నవ్వే కలిగించే నాలో కవ్వింత
ఒక తియ్యని గిలిగింత

ఇన్నాళ్ళూ నేనెరుగను ఈ తీపి బాధ
ఈ రోజే మొదలైనది నాలోని ఈ కధ
కలలోన, మెలకువలో ప్రతి చోట నువ్వే
ఎంత తరిమినా వెల్లిపోనంటావే  
పరధ్యానం లో ఉంటానే ప్రతి క్షణం నేను
పని చేసుకోనీవే క్షణమైనా నువ్వు
పేరేమని పెట్టను ప్రియమైన తలపులకి 
ప్రేమా!...ఆ పేరే సరిపోదన్న భావన
వెతకలేనేమో ఈ మైకానికి పదాన్ని
దొరకదేమో ఆ పదం తెలుగు నిఘంటువులో...